‘చరణ్’ తో జాన్వీ కపూర్ రొమాన్స్

23
- Advertisement -

జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు. ప్రస్తుతం టాలీవుడ్ లో జాన్వీ కపూర్ టైమ్ నడుస్తోంది. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొరటాల శివ ‘దేవర’ కోసం జాన్వీ కపూర్ ను ఎంపిక చేసిన క్షణం నుంచి.. ఆమెకు సౌత్ లో ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. నిజానికి జాన్వీ కపూర్ కి పెద్దగా నటన రాదు అని ఇండస్ట్రీలో ఆఫ్ ది రికార్డుగా ఆమె గురించి కొన్ని నెగిటివ్ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. అయినప్పటికీ, ఆమె కచ్చితంగా త్వరలోనే నెంబర్ వన్ పొజిషన్ కి వస్తోందని టాక్.

నిజానికి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి జాన్వీ కపూర్ నటనలో ఎక్కడా పెద్దగా పాజిటివ్ ఇంపాక్ట్ చూపించింది లేదు. వాస్తవానికి హిందీలో అడపాదడపా కొన్ని సినిమాలు చేసినా.. జాన్వీ కపూర్ కి స్టార్ డమ్ రాలేదు. కానీ, బాలీవుడ్ లో అనుకున్నంతగా జాన్వీ కపూర్ కి వర్కౌట్ కాకపోయినా, తెలుగులో మాత్రం ఆమె కెరీర్ అద్భుతంగా యూ టర్న్ తీసుకుంది. ఈమెకు వరసగా తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. తాజాగా రామ్ చరణ్ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా ఇప్పటికే ఖరారు అయింది. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా బలమైన ట్రాక్ ఉంది. కాబట్టి క్రేజ్ ఉన్న హీరోయిన్నే తీసుకోవాలని బుచ్చిబాబు ఆశ పడ్డాడు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ ను ఫైనల్ చేశాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్‌ ఈ విషయాన్ని రివీల్ చేశారు.

ఇంతకీ బోనీ కపూర్‌ ఏం మాట్లాడాడు అంటే.. ‘త్వరలో జాన్వీ కపూర్‌ చరణ్‌ తో నటించనున్న చిత్రం ప్రారంభం కానుంది’ అని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. పైగా ఈ సినిమాలో జాన్వీకపూర్‌ పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది.

ALso Read:ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

- Advertisement -