ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

15
- Advertisement -

ఈ వారం ‘సుందరం మాస్టర్‌’, ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’, ‘సిద్ధార్థ్‌ రాయ్‌’, ‘ముఖ్య గమనిక’ వంటి భారీ చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఐతే, ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

అపార్ట్‌మెంట్‌ 404 (కొరియన్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

పోచర్‌ (తెలుగు డబ్బింగ్‌) – ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ :

విల్‌ ట్రెంట్‌ (వెబ్‌సిరీస్‌) – ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మలైకోట్టై వాలిబన్‌ (మలయాళం) – ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నెట్‌ ఫ్లిక్స్‌ :

అవతార్‌: ది లాస్ట్‌ ఎయిర్‌బెండర్‌ (హాలీవుడ్‌) – ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బరీడ్‌ ట్రూత్‌ (హిందీ) – ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:ఆరు గ్యారెంటీలపై ఖర్గేకు కవిత లేఖ..

- Advertisement -