పవన్ పై క్రిమినల్ కేసు.. అసలెందుకు ?

21
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పవన్ వాలెంటిర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంగా రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 499,500 సెక్షన్ల కింద పవన్ పై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని పవన్ కు నోటీసులు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత ఏడాది వాలెంటరీ వ్యవస్థపై పవన్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ వచ్చారు. వాలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం డేటా లీకేజ్ కు పాల్పడుతోందని, సామాన్య ప్రజల డేటాను దొంగిలించి ఇతర కంపెనీలకు అమ్మేస్తోందని పవన్ ఘాటుగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు.

అంతే కాకుండా వాలంటీర్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందని, వాలెంటరీ వ్యవస్థ చట్టబద్దం కాదని.. ఇలా చాలానే వ్యాఖ్యానిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. అంతే కాకుండా వాలంటర్ల కారణంగా రాష్ట్రంలో మహిళా మిస్సింగ్ కేసులు పెరుగుట్టున్నట్లు కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఆ టైమ్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిక్కుముడిలా మారాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాలెంటరీ వ్యవస్థపై పవన్ నిరాధార ఆరోపణలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేసింది.

అయితే గత ఏడాది చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు పిటిషన్ వేయడం ఎంటనే సందేహాలు చాలమందిలో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు పవన్ దూకుడుకు చెక్ పెట్టేందుకే వైఎస్ జగన్ ఈ రకమైన చర్చకు పాల్పడ్డారనేది కొంతమంది చెబుతున్న మాట. అయితే ఈ నెల 25న పవన్ విచారణకు హాజరవుతారా లేదా అనే సందేహాలు తలెత్తున్న వేళ ఈ పరిణామాలు జనసేన పార్టీని గట్టిగానే దెబ్బ తీస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే వాలంటర్ల ఓటు బ్యాంకు పవన్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. మరి ఊహించని రీతిలో ఎదురైన ఈ పరిణామాన్ని పవన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Also Read:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎంపీ అరవింద్ చురకలు

- Advertisement -