జగనన్న పథకాలకు.. టీడీపీ బ్రేక్!

33
- Advertisement -

సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడూ ఒక పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలను.. అధికారం మారిన తరువాత తొలగించడం లేదా అలాగే ఉంచడం వంటివి పాలిటిక్స్ లో సర్వసాధారణం. ప్రజలకు ఉపయోగం అనిపెంచే ఆరోగ్య శ్రీ పథకాలను ప్రభుత్వాలు మారుతున్నప్పటికి.. ఇంకా అమలు చేస్తూనే ఉన్నారు. ఇక అన్నా క్యాంటిన్ లాంటి పథకాలను అధికారంలో ఉన్న పార్టీకి నచ్చకపోవడంతో రద్దు చేస్తున్నారు. ఇలా జరగడం సర్వసాధారణమే. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో నిరుద్యోగ భృతి, అన్నా క్యాంటిన్ లాంటి పథకాలను ప్రవేశ పెట్టారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలను రద్దు చేశారు.

ఇక ప్రస్తుతం జగన్ సర్కార్ కూడా లెక్కకు మించి పథకాలను ప్రవేశ పెడుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే పథకాలు మారే అవకాశం ఉందా అంటే అవుననే చెప్పవచ్చు. ఇప్పటికే జగన్ ప్రవేశ పెడుతున్న ఎన్నో పథకాలపై టీడీపీ జనసేన పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ప్రజాధనాన్ని వ్యర్థంగా పంచుతున్నారని సి‌ఎం జగన్ పై మండిపడుతున్నాయి. అయితే ఒకవేళ ప్రభుత్వం మారితే ఏ ఏ పథకాలు రద్దు అయ్యే అవకాశం ఉందో కూడా టీడీపీ జనసేన పార్టీలు క్లారిటీ ఇస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను టీడీపీ వస్తే రద్దు చేస్తామని నారా లోకేశ్ తాజాగా వ్యాఖ్యానించారు.

ఈ పథకాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, వాటి స్థానంలో నేరుగా కళాశాలలకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించే విధానాన్ని తీసుకొస్తామని లోకేశ్ తెలిపారు. ఇక జగన్ ప్రవేశ పెట్టిన మరికొన్ని పథకాలు కూడా టీడీపీ వస్తే రద్దయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు పవన్ మాత్రం పవన్ మాత్రం.. తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలౌతున్న అన్నీ పథకాలను అలాగే కొనసాగిస్తామని, అవి అలాగే కొనసాగిస్తూ మరిన్ని కొత్త పథకాలు ప్రవేశ పెడతామని జనసేనాని చెబుతున్నారు. మొత్తానికి ఒకరి అధికారంలో ఆయా పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రజలు.. ప్రభుత్వం మారిన తరువాత ఆ పథకాలు రద్దయితే, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు.

ఇవి కూడా చదవండి…

175 విత్ జనసేన.. కమలం క్లారిటీ!

సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం..

హెకానీ జఖాలు..నాగా చరిత్రలో తొలి మహిళ ఎమ్మెల్యే

- Advertisement -