రాచ‌కొండ సీపీతో జ‌గ‌న్‌మోహ‌న్‌రావు భేటీ

29
- Advertisement -

భార‌త్‌-ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా వ‌చ్చే నెల 25 నుంచి జ‌ర‌గ‌నున్న తొలి మ్యాచ్‌కు హైద‌రాబాద్ ఆతిథ్య‌మిస్తోంది. ఈ నేప‌థ్యంలో రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ జి.సుధీర్‌బాబును హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) అధ్య‌క్షుడు అర్శ‌న‌పల్లి జ‌గ‌న్‌మోహ‌న్‌రావు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న అంత‌ర్జాతీయ టెస్టు మ్యాచ్‌కు అవ‌స‌ర‌మైన‌ భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. మ్యాచ్‌ను స‌జావుగా నిర్వ‌హించేందుకు స‌హ‌కారం అందించాల్సిందిగా సీపీను జ‌గ‌న్‌మోహ‌న్‌రావు కోరారు. దీంతో మంగ‌ళ‌వారం ఉప్ప‌ల్ స్టేడియంకు వ‌చ్చి ప‌రిశీలిస్తాన‌ని సీపీ చెప్పారు. సీపీను క‌లిసిన వారిలో జ‌గ‌న్‌మోహ‌న్‌రావుతో పాటు హెచ్‌సీఏ కార్య‌ద‌ర్శి దేవ్‌రాజ్‌, ఉపాధ్య‌క్షుడు ద‌ల్జిత్ సింగ్‌, స‌హాయ కార్య‌ద‌ర్శి బ‌స‌వ‌రాజు, కోశాధికారి సీజే శ్రీనివాస్ ఉన్నారు.

Also Read:నెలసరి సమస్యలకు..పరిష్కారం!

- Advertisement -