నెలసరి సమస్యలకు..పరిష్కారం!

54
- Advertisement -

మహిళలలో రుతుక్రమం ప్రతినెల జరుగుతూ ఉంటుంది. కొందరికి 30 రోజులకు నెలసరి వస్తే.. మరికొందరికి 40 రోజులకు, ఇంకొందరికి 45 రోజులకు నెలసరి వస్తుంటుంది. అయితే నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే బాధలు అన్నీ ఇన్ని కావు. నెలసరి వచ్చిన మొదటి మూడు రోజుల్లో పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి, నడుం నొప్పి, చిరాకు, కాళ్ళ తిమిర్లు, నీరసం, ఆందోళన, ఒత్తిడి.. ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమస్యలను బయటకు చెప్పుకోలేక వారిలో వారే మదన పడుతుంటారు. అయితే నెలసరి టైమ్ లో మహిళలు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆ సమయంలో వచ్చే సమస్యల నుంచి కొంతలో కొంతైనా విముక్తి పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం..!

నెలసరి టైమ్ లో చామోమిలే ( చామంతి ) టీ ఎంతగానో ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో దొరికే చామోమిలే టీ పొడిని వేడి నీటిలో వేసుకొని ఉదయం సాయంత్రం పీరియడ్స్ టైమ్ లో త్రాగడం వల్ల నెలసరి నొప్పి నుంచి కొంత విముక్తి లభిస్తుందట. అంతేకాకుండా ఈ టీ తాగడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు కూడా దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందట.

ఇక నెలసరి సమస్యలను తగ్గించడంలో తులసి ఆకులు కూడా దివ్యఔషధంలా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెంటరీ గుణాలు.. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయట. తులసి ఆకులను కప్పు నీటిలో కలిపి వేడి చేయాలి తరువాత దాన్ని చల్లార్చి కొద్ది కొద్దిగా సేవిస్తూ ఉంటే పీరియడ్స్ టైమ్ లో వచ్చే నొప్పి నుంచి విముక్తి లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read: కానుగ కషాయం తాగితే ఎన్ని లాభాలో!

ఇక అల్లం తురుము కూడా నెలసరి సమస్యలను తగ్గించడంలో సహాయ పడుతుందట. కప్పు నీటిలో అల్లం తురుము ను బాగా వేడి చేసి చల్లార్చి దానికి నిమ్మరసం, తేనె కలిపి పీరియడ్స్ టైమ్ లో రోజుకు మూడు లేదా నాలుగు సార్లు కొద్ది కొద్దిగా సేవిస్తే నెలసరి టైమ్ లో వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -