ఏపీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం..

6
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. తొలుత సీఎం చంద్రబాబు ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రుల తర్వాత మాజీ సీఎం, జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారానికి వెళ్లేముందు సభ్యులకు నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ మోహన్ రెడ్డిచే ప్రమాణ స్వీకారం చేయించారు.

పవన్ కల్యాణ్ ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించగానే.. టీడీపీ, జనసేన సభ్యులు లేచినిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేశ్ తన స్థానంలో లేచినిలబడి తన ఎదురుగా ఉన్న బల్లపైకొట్టి శబ్దం చేస్తూ తన ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

Also Read:సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి పోచారం

- Advertisement -