YS Jagan:వైసీపీలో జగనే మోనార్క్?

28
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని జగన్ టార్గెట్ గా ఉన్నారు. మరోవైపు పార్టీలో నేతలు ఒక్కొక్కరుగా జగన్ పై ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుతం 151 మంది ఎమ్మేల్యేలు ఉన్న వైసీపీలో దాదాపు 50-60 మంది ఎమ్మేల్యేలు జగన్ తీరుపై తీవ్ర అసహనంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దాంతో వీరంతా కూడా పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే ఉండవల్లి శ్రేదేవి, కోటంరెడ్డి శ్రేధర్ రెడ్డి, ఆనం ఆదినారాయణ రెడ్డి, వంటి వారు పార్టీకి షాక్ ఇస్తూ టీడీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. వీరి దారిలోనే మరికొంత మంది ఎమ్మేల్యేలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. .

తాజాగా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఫై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న ఒక్కగుణం కూడా జగన్ లో లేదని, మితిమీరిన ధనదాహంతో జగన్ ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో జగన్ మోనార్క్ లా వ్యవహరిస్తారని, నేతలకు అసలు ప్రాధాన్యం ఇవ్వరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మేకపాటి. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మేకపాటి చేసిన కామెంట్స్ ను బట్టి చూస్తే వైసీపీలోని నేతలు జగన్ తీరుపై ఉన్న అసంతృప్తి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ టార్గెట్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అసంతృప్త వాదుల నుంచి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. మరి పార్టీలో లొసుగులను జగన్ సరిచేస్తారా ? లేదా వాటన్నిటిని లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.

Also Read:Mahesh:సంక్రాంతికి సోలోగా మహేష్?

- Advertisement -