Mahesh:సంక్రాంతికి సోలోగా మహేష్?

25
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” గుంటూరు కారం “. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా మూవీస్ బుల్లితెరపై కల్ట్ క్లాసిక్ మూవీస్ గా నిలిచాయి. దాంతో మూడోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో గుంటూరుకారం మూవీ రాబోతుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. మూవీకి సంబంధించి ఇప్పటికే రెండు లిరికల్ సాంగ్స్, టిజర్, పోస్టర్స్ రిలీజ్ చేసింది. ఇక న్యూ ఇయర్ కానుకగా మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంచితే ఈ సంక్రాంతికి మహేష్ ” గుంటూరు కారం ” మూవీ కి పోటీగా మరో నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. .

ఆ మూవీస్ ల్లో టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన హనుమాన్ కూడా ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని కూడా జనవరి 12 నే విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించింది. అయితే బరిలో మహేష్ బాబు ఉండడంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుందని భావించిన హనుమాన్ టీం రిలీజ్ డేట్ మార్చుకునే ఆలోచనలో ఉందట. జనవరి 12 కంటే ఒకరోజు ముందు లేదా తర్వాత రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో జనవరి 12న మహేష్ బాబుకు సోలో రిలీజ్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో గుంటూరు కారం మూవీ భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ సంక్రాంతి సీజన్ లో మహేష్ పోటీని ఇతర సినిమాలు ఎంత వరకు తట్టుకుంటాయో చూడాలి.

Also Read:తండేల్…అప్‌డేట్స్

- Advertisement -