ఓటమిని ఒప్పుకున్న రేవంత్!

6
- Advertisement -

రేవంత్ రెడ్డి మొనగాడు పెత్తనం తీసుకున్నాక.. ఆయన చేసింది చెప్పట్లేదు అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేశారని వాళ్ళ గురించి చెప్తున్నాడు కానీ రేవంత్ చేసిందేంటి చెప్పలేకపోతున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి నోటి దురుసు వల్ల అతన్ని బీహార్ ఎన్నికల ప్రచారం నుండి పంపించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పిలిపించుకున్నారు… రేవంత్ రెడ్డి అజ్ఞానానికి అధికారం తోడై అహంకారం పెరిగి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అన్నారు. పదవులతో గౌరవం రాదు, చేసే మంచి పనులతోని వస్తుంది… రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ఆయనకు భయం మొదలైనట్లు తెలుస్తుంది అన్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పదవికి ఉపద్రవం వస్తున్నట్లుంది… జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం కాదు అన్నప్పుడే రేవంత్ రెడ్డి ఓటమిని ఒప్పుకున్నాడు అన్నారు. రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రోజు కూర్చొని చేయకూడని పనులు చేస్తున్నారని, ఆయన మూర్ఖత్వం, అజ్ఞానం వల్ల అనర్థాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Also Read:ECB..సంచలన నిర్ణయం!

- Advertisement -