త్వరలో టీడీపీ కమిటీలు:చంద్రబాబు

8
- Advertisement -

నెలాఖరు వరకు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఎంపిక పూర్తి చేస్తాం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. డిసెంబర్‌ నుంచి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తాం… విశాఖపట్నంకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి అన్నారు. అనుకున్న సమయానికి క్వాంటమ్‌ కంప్యూటర్‌ అమరావతికి వచ్చేలా ప్రయత్నిస్తున్నాం అన్నారు.

అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజలతో భేటీ అయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నియామకంపై చర్చిస్తూ, పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా నాయకత్వ నియామకాలు జరగాలని సూచించారు. పార్టీ విస్తరణ, గ్రామ స్థాయి బలోపేతం, వచ్చే ఎన్నికల వ్యూహం వంటి అంశాలపై కూడా అభిప్రాయాలు మార్పిడి చేశారు.

Also Read:ECB..సంచలన నిర్ణయం!

- Advertisement -