ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 2026 సీజన్ నుంచి కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో కూకబుర్రా బంతి వాడకాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కౌంటీ జట్ల డైరెక్టర్లు మరియు ప్రొఫెషనల్ గేమ్ కమిటీ నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా తీసుకుంది.
ఈ ప్రయోగం మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది . అంతర్జాతీయ పరిస్థితులకు తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు కౌంటీ ఆటగాళ్లకు సహాయపడాలన్న ఉద్దేశంతో. అయితే, ఈ ప్రయత్నం అనుకున్న ఫలితాలను ఇవ్వలేదని ECB గుర్తించింది. ఎక్కువ మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగడం, బౌలర్లకు పెద్దగా సహాయం లేకపోవడం వంటి కారణాలతో ఈ ప్రయోగం విఫలమైందని తేలింది.
ఉదాహరణకు, ఈ సీజన్‌లో ది ఓవల్‌లో జరిగిన సరీ vs డర్హామ్ మ్యాచ్‌లో, సరీ జట్టు 820/9 డిక్లేర్ చేయడంతో ఆ మ్యాచ్ నిరుత్సాహకరంగా ముగిసింది. కూకబుర్రా బంతిని మొదటిసారిగా 2023 సీజన్‌లో రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో ఉపయోగించారు. తర్వాత 2024 మరియు 2025 సీజన్లలో నాలుగు రౌండ్ల చొప్పున దీని వాడకాన్ని విస్తరించారు.
అయితే, అక్టోబర్‌లో జరిగిన చర్చల్లో అన్ని 18 ఫస్ట్-క్లాస్ కౌంటీల క్రికెట్ డైరెక్టర్లు ఈ ప్రయోగాన్ని నిలిపివేయాలని కోరడంతో, ECB ప్రొఫెషనల్ గేమ్ కమిటీ ఈ వారం అధికారికంగా ఆ నిర్ణయాన్ని ఆమోదించింది. దాంతో, 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లోని అన్ని 14 రౌండ్లు మళ్లీ సంప్రదాయ హ్యాండ్-స్టిచ్ చేయబడిన డ్యూక్స్ బంతితోనే ఆడబడతాయి. మెషిన్‌తో తయారైన కూకబుర్రా బంతి ఇకపై ఉపయోగించబడదు
Also Read:తగ్గిన వర్షాలు..పెరుగుతున్న చలి!

