నియంత్రిత సాగుతోనే గిట్టుబాటు ధర: మంత్రి

239
Minister Jagadish Reddy
- Advertisement -

నియంత్రిత సాగుతోటే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అందులో భాగమే లాబాదయక పంటలపై రైతాంగం దృష్టి సారించేలా నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నియోజకవర్గలా వారిగా మే 30 నుండి నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న విషయం విదితమే.అందులో భాగంగా గురువారం రోజున భోనగిరిలో నిర్వహించిన సదస్సులో మంత్రి జగదీష్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగిస్తూ.. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలి అన్నదే అవగాహన సదస్సుల లక్ష్యం అని ఇందులో రైతులను భాగస్వామ్యం చేసేందుకు ప్రతి ఒక్కరు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. డిమాండ్ ఉన్నపంటలపై రైతులు దృష్టి సరించినప్పుడు మాత్రమే మనం పండించిన పంటకు మనం ధర నిర్ణయించుకునే శక్తి వస్తుందన్నారు.

రైతులు దళారుల చేతికి చిక్కకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగుపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు.రైతులను ఆర్ధికంగా పరిపుష్టం చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని అందుకు అనుగుణంగా రైతులు కలసి వస్తే భవిష్యత్ మొత్తం వ్యవసాయ రంగానిదే అవుతుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంచలనాత్మక మైన నిర్ణయాలతో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల కృష్ణా,గోదావరి ఆయకట్టు కింద సాగులోకి వచ్చాయని…అయినా గిట్టుబాటు ధర లేకపోవడం రాక పోవడం అసంతృప్తి కి లోను చేస్తుందన్నారు. గిట్టుబాటు ధర కల్పనలో భాగమే నియంత్రిత సాగు విధానం అమలులోకి తెచ్చినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

స్థానిక శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోరాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనమండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, డిసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -