కోర్టు మెట్లెక్కిన బాలీవుడ్‌ బ్యూటీ..

44
Jacqueline Fernandez
- Advertisement -

మానీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నబాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. 15 రోజుల పాటు విదేశీ ప్రయాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. దుబాయిలో జరిగే ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా తనను అనుమతించాలని కోరుతూ ఆమె ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఫ్రాన్స్, నేపాల్ లోనూ పర్యటించాల్సి ఉందని కూడా జాక్వెలిన్ తెలిపింది.

ప్రస్తుతం జాక్వెలిన్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పర్యవేక్షణలో ఉన్నారు. ఈడీ పర్యవేక్షణలో ఉన్నందున అనుమతి లేకుండా ఆమె విదేశీ ప్రయాణానికి వెళ్లడానికి లేదు. గత డిసెంబర్ లోనూ ఆమెను ముంబై ఎయిర్ పోర్ట్ లో నిర్బంధించడం జరిగింది. దోపిడీ కేసును ఎదుర్కొంటున్న లాబీయిస్ట్ సుకేశ్ చంద్రశేఖర్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండడం, సుకేశ్ నుంచి ఖరీదైన బహుమతులు స్వీకరించినట్టు ఈడీ విచారణలో ఆమె అంగీకరించడం తెలిసిందే. దీంతో జాక్వెలిన్ కు సంబంధించి రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది.

- Advertisement -