బుల్లితెరపై టాప్ రేటింగ్ షో జబర్దస్త్. జబర్దస్త్ వల్ల ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి దొరికారు. ఇక ఈ షోకి కీలకం యాంకర్. ఇప్పటివరకు అనసూయ, రష్మి మెప్పిస్తూ వచ్చారు. అయితే కొంతకాలం క్రితం అనసూయ ఈ షోని వదిలి వెళ్లగా రష్మీనే రెండు షోలకు యాంకర్‌గా చేస్తూ వచ్చింది. అయితే తాజాగా కొత్తయాంకర్‌ని జబర్దస్త్‌కు తీసుకువచ్చారు నిర్వాహకులు. తెలుగు, తమిళ్ సీరియల్స్ లో గుర్తింపు తెచ్చుకున్న సౌమ్య రావును కొత్త యాంకర్‌గా తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రొమో రిలీజ్ కాగా ఆకట్టుకుంది సౌమ్య.
తాజాగా ఈ యాంకర్ రెమ్యునరేషన్‌కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం సౌమ్య రావు రెమ్యూనరేషన్ ఎపిసోడ్ కి రూ. 1 లక్ష నుండి 1.5 లక్షల మధ్య ఫిక్స్ చేశారట.
ఇది అనసూయ, రష్మి కంటే తక్కువే అయినా సౌమ్య పెర్ఫార్మన్స్, రేటింగ్ ఆధారంగా పెంచుతామని హామీ ఇచ్చారట. రష్మీ ఎపిసోడ్ కి రూ. 2 లక్షలు పైనే తీసుకుంటున్నారని సమాచారం.
ఇవి కూడా చదవండి..