ఈ టార్చ‌ర్ ను త‌ట్టుకోలేక‌పోతున్నాః జ‌బ‌ర్ధ‌స్త్ అవినాష్

662
avinash

బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు ముక్కు అవినాష్‌. ఆ కామెడీ షోలో టీం లీడ‌ర్ గా కూడా ఆయ‌న వ్య‌వ‌హారిస్తున్నారు. త‌న‌దైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. తాజాగా అవినాష్ చేసిన ఓ స్కిట్ వ‌ల్ల ఆయ‌న చాలా ఇబ్బందులు ప‌డ్డారు. ఆయ‌న గ‌ల్ఫ్ బాధితులపై చేసిన స్కిట్ వివాదంగా మారింది. ఆ స్కిట్ పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఈస్కిట్ లో త‌ప్పులుంటే క్ష‌మించాల‌ని ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా సారీ చెప్పారు.

jabardasth avinash

తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంట‌ర్యూలో ఆయ‌న ఈటాపిక్ పై స్పందించాడు. నేను చేసిన పొరపాటుకు వెంటనే క్షమాపణ చెప్పాను. అయినా వినిపించుకోకుండా సోషల్ మీడియాలో నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నన్నే కాకుండా మా అమ్మను .. వదినను కూడా ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. ఈ టార్చర్ ను నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ భయ్యా మీరు ఈ టార్చర్ ఆపకపోతే నేను సూసైడ్ చేసుకోవలసి వస్తుంది. అంటూ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.