ఎన్టీఆర్ బ‌యోపిక్.. ప్ర‌ముఖ పాత్ర‌లో క్రిష్..

253
krish
- Advertisement -

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రం ఎన్టీఆర్. బాల‌కృష్ణ ప్ర‌ధాన‌పాత్ర‌లో పోషిస్తున్న ఈసినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌ముఖ పాత్ర పోషించిన వారిని సినిమాలో చూపించ‌నున్నారు. ఈసినిమా షూటింగ్ హైద‌ర‌బాద్ లో శ‌ర‌వేగంగా చిత్ర‌క‌ర‌ణ జ‌రుపుకుంటోంది. చాలా మంది ప్ర‌ముఖ నటులు ఈసినిమాలో న‌టించ‌డంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ntr

తాజాగా వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం ఈసినిమాలో క్రిష్ ప్ర‌ముఖ పాత్ర‌లో క‌నిపించ‌నున్నట్లు తెలుస్తుంది. ఈచిత్రంలో ఆయ‌న ద‌ర్శ‌కుడు కేవీ రెడ్డి పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఎన్టీఆర్ తో ద‌ర్శ‌కుడు కేవీ రెడ్డి చాలా సినిమాలు తెర‌కెక్కించాడు. ఈ ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం వుంది.

cbn ntr

తిరుగులేని దర్శకుడిగా వెలుగొందిన కేవీ రెడ్డి, చివరిదశలో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయనకి ఎన్టీఆర్ సాయం చేశారు. ఆ సన్నివేశాలనే ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట. ఇటివ‌లే విడుద‌లైన మ‌హాన‌టి పాత్ర‌లో ద‌ర్శ‌కుడు కేవీ రెడ్డి పాత్ర‌లో క్రిష్ క‌నిపించిన విష‌యం తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి9న ఈమూవీని సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -