ప్రేమక‌థ‌లంటే చాలా ఇష్టంః పూజా హెగ్డె

364
pooja
- Advertisement -

వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డె. ఆమూవీ అంత పెద్దగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌క‌పోయినా పూజా న‌ట‌న‌కు మాత్రం మంచి గుర్తింపు వ‌చ్చింది. దీంతో వెంట‌నే అమ్మ‌డు బాలీవుడ్ లో కూడా ఛాన్స్ వ‌చ్చింది. అక్క‌డ ఆమె న‌టించిన మూవీ ప్లాప్ కావ‌డంతో తిరిగి మ‌ళ్లీ తెలుగు సినిమాల్లో బిజీగా ఉంది. ఇటివ‌లే ఆమె న‌టించిన సినిమాలు విజ‌యం సాధించాయి.

pooja hefge

అల్లు అర్జున్ తో దువ్వాడ జ‌గ‌న్నాథం, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర రాఘవ సినిమాల్లో న‌టించింది. తాజాగా మ‌హేశ్ బాబు న‌టిస్తోన్న మ‌హార్షి మూవీలో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇటివ‌లే ఆమె ఓ ఛాన‌ల్ ఇంట‌ర్యూలో ప‌లు విష‌యాలు వెల్ల‌డించింది.

ntr pooja

త‌న‌కు ప్రేమ క‌థ‌లంటే చాలా ఇష్టం అని చెప్పింది పూజా.ప్రస్తుతం పెద్ద హీరోలతో కమర్షియల్ యాక్షన్ చిత్రాలలోనే నటిస్తున్నప్పటికీ నాకు వ్యక్తిగతంతా ప్రేమకథ లంటే చాలా ఇష్టమ‌ని..అలాంటి క‌థ‌లు త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తే మాత్రం అస‌లు వ‌దులుకోన‌ని చెప్పింది.

- Advertisement -