CJP నిరసన..ఆందోళనకారుల అరెస్ట్

1
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం నిరసన తెలిపేందుకు వచ్చిన పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు, బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ నిరసనకారులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

నిరసనకు వచ్చిన ఓ మహిళా ఆందోళనకారిణి మాట్లాడుతూ.. జంతర్ మంతర్ దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు ఇలాంటి వేదికలు ధైర్యాన్ని ఇస్తాయని చెప్పారు. ఇంట్లో కూర్చుని దేశం గురించి మాట్లాడటం కంటే, ప్రజలు ఒకచోట చేరి తమ గళాన్ని వినిపించే వాతావరణాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే జంతర్ మంతర్‌కు రావాలని ఆమె అన్నారు.

రవాణాపై ఆంక్షలు విధించడం, నిరసన స్థలానికి చేరుకునేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆమె స్పందించారు. తనకు సొంత వాహనం ఉండటంతో అక్కడికి చేరుకోగలిగానని తెలిపారు. తన తల్లి కూడా నిరసనలో పాల్గొనాలని కోరుకున్నారని, ఆమె వయసు 60 ఏళ్లు దాటిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై తన తల్లి అసంతృప్తితో ఉన్నారని వివరించారు.

రాజ్యాంగాన్ని ఒక ఒప్పందంతో పోల్చిన ఆమె.. దాన్ని ఇరుపక్షాలు అంగీకరించాయని, ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.మరో విద్యార్థి తనను జైలులో ఖైదీలా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను స్నేహితులతో కలిసి వచ్చానని, తనను బయటకు పంపించాలని కోరాడు.

Also Read:విమర్శలకు భయపడేది లేదు!

మరోవైపు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు వెనక్కి తగ్గడం లేదు. ఓటర్ల జాబితా సవరణలపై ఆరోపణలు చేస్తూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -