BB10:కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి..

8
- Advertisement -

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో కెప్టెన్సీ పోరు ఆసక్తికరంగా మారింది. నామినేషన్లు, గ్రూప్ రాజకీయాలు, కెప్టెన్సీ టాస్కులతో హౌస్‌లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. తాజాగా జరిగిన కెప్టెన్సీ పోటీలో సుధీర్ రెడ్డి విజయం సాధించి హౌస్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈ విజయానికి ఝాన్సీ అందించిన సహకారం కీలకంగా నిలిచింది.

తాజా ఎపిసోడ్‌లో నామినేషన్ల నుంచి తప్పించుకునేందుకు కంటెస్టెంట్లు తమదైన వ్యూహాలు అమలు చేశారు. ముకేశ్‌ను కాపాడేందుకు ఝాన్సీ స్వయంగా డేంజర్ జోన్‌లోకి వెళ్లగా, షాలిని–రోహిత్ మధ్య కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. చివరకు రోహిత్ రిస్క్ తీసుకుని డేంజర్ జోన్‌కు వెళ్లేందుకు అంగీకరించాడు. అనంతరం నిర్వహించిన ‘ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్’ టాస్కులో రామ్ ప్రసాద్, నరేష్ విజయం సాధించారు. అయితే మైండ్ గేమ్‌లో పైచేయి సాధించిన రామ్ ప్రసాద్ సేఫ్ కాగా, నరేష్ ప్రమాదంలో పడ్డాడు.

మరోవైపు కెప్టెన్సీ రేసులో రామ్ ప్రసాద్, దేబ్జానీ, అమన్, వర్షిణి, వంశీ, త్రిగుణ్, సుధీర్ రెడ్డి అర్హత సాధించారు. ఏడుగురిలో ఇద్దరు తప్పుకోవాలన్న బిగ్‌బాస్ ఆదేశంతో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు ఐదుగురు సభ్యులతో ప్రధాన కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమైంది. ‘షిప్ మేకింగ్’ టాస్కులో బిన్ బ్యాగుల్లోని విడిభాగాలను ఉపయోగించి షిప్‌ను తయారు చేయాల్సి వచ్చింది. ఈ పోటీలో తొలుత త్రిగుణ్, దేబ్జానీ వెనుదిరగగా.. చివరి వరకు సుధీర్, వంశీ, రామ్ ప్రసాద్ పోటీపడ్డారు.

Also Read:విమర్శలకు భయపడేది లేదు!

మ్యాజిక్ పవర్‌తో నామినేషన్ల నుంచి తప్పించుకున్న ఝాన్సీ.. కెప్టెన్సీ అవకాశాన్ని కోల్పోయినా సుధీర్‌కు మద్దతుగా నిలిచింది. ఆమె సహకారంతో పాటు తన ప్రణాళికతో సుధీర్ షిప్‌ను వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అనంతరం తనకు మార్గదర్శకంగా నిలిచిన రామ్ ప్రసాద్‌కు సుధీర్ నమస్కరించడం హౌస్‌మేట్స్‌ను ఆకట్టుకుంది. బిగ్‌బాస్ అతడికి కెప్టెన్సీ గోల్డ్ మెడల్ అందించారు.

- Advertisement -