విమర్శలకు భయపడేది లేదు!

3
- Advertisement -

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రోలింగ్‌పై స్పందించారు. ఇతరుల అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇస్తూ తన నిర్ణయాలను మార్చుకుంటే భయంతో ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడేదని ఆమె అన్నారు. విమర్శలు ఎదురైనప్పుడు వాటికి భయపడకుండా, మన విలువను మనమే గుర్తించుకోవాలని సూచించారు.

ఇటీవల భర్త విక్కీ కౌశల్‌తో కలిసి బయటకు వచ్చిన సమయంలో కత్రినా కైఫ్ ప్రసవానంతర రూపంపై కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లండన్‌లో తన బ్యూటీ బ్రాండ్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. సోషల్ మీడియాలో వచ్చే అభిప్రాయాలు మన ఆత్మవిశ్వాసాన్ని, జీవితంలో తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడాలని చెప్పారు.

సోషల్ మీడియాలో అనేక రకాల అభిప్రాయాలు కనిపిస్తుంటాయి. వాటన్నింటినీ సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తే మన కోసం మనం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. మన ఆత్మగౌరవం, మన విలువలను ఇతరుల అభిప్రాయాల ఆధారంగా నిర్ణయించుకోకూడదు అని కత్రినా పేర్కొన్నారు.

విమర్శలు తన చర్యలను శాసించేందుకు అనుమతిస్తే భయంతో స్తంభించిపోయేదానినని ఆమె తెలిపారు. నేను ఎదుర్కొన్న ప్రతి విమర్శకు, ప్రతి కామెంట్‌కు అనుగుణంగా నా నిర్ణయాలు మార్చుకుని ఉంటే.. భయంతో ముందుకు కదల్లేని పరిస్థితి వచ్చేది. జీవితంలో ఏ రంగంలోనూ ముందుకు సాగలేకపోయేదాన్ని. కొన్నిసార్లు ప్రపంచం మనల్ని ప్రశంసిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో మనకు మనమే అతిపెద్ద మద్దతుదారులుగా నిలవాలి అని వివరించారు.

Also Read:భారత్‌తో టీ20 సిరీస్‌..డబుల్ షాక్!

- Advertisement -