ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్

184
IvankaTrump at Global Entrepreneurship Summit
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు ఇవాంక ట్రంప్. భారత ఆర్ధిక వ్యవస్థను మోడీ ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నారని  ప్రశంసలు గుప్పించింది. హెచ్‌ఐసీసీలో జీఈ సదస్సులో మాట్లాడిన ఇవాంక హైదరాబాద్ ఇండియాలోనే ఇన్నోవేషన్‌ హబ్‌కు కేరాఫ్‌గా మారిందన్నారు. అమెరికా …భారత్ నిజమైన స్నేహితులు అని తెలిపింది.

టీ అమ్మిన వ్యక్తి ప్రధాని స్ధాయికి ఎదగడం గర్వకారణమని  ఇవాంక పేర్కొంది. భారత డాక్టర్లు,ఇంజనీర్లు అద్బుతాలు సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చింది.70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారని తెలిపింది. టెక్నాలజీని అందిపుచ్చుకున్న హైదరాబాద్‌కు రావడం గర్వకారణంగా ఉందని తెలిపింది.

IvankaTrump at Global Entrepreneurship Summit
భారతీయులు మాకు స్పూర్తని తెలిపింది ఇవాంక.మార్పు సాధ్యమని మోడీ నిరూపించారని చెప్పింది. భారత్ అసాధారణ ప్రగతిని సాధించిందని దేశంలో కొత్త యూనివర్సిటీలు వచ్చాయని గుర్తుచేసింది. అవకాశం ఉంటే హైదరాబాద్ బిర్యానీ రుచిచూస్తానని తెలిపింది. భారత ఉపగ్రహాలు చంద్రుడు,గురు గ్రహంపై వెళుతున్నాయని తెలిపింది.

దశాబ్దకాలంగా వ్యాపార రంగంలో మహిళలు రాణిస్తున్నారని ….అమెరికాలో 11 మిలియన్ల మహిళ పారిశ్రామిక వేత్తలున్నారని తెలిపింది. 1500 మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఒకే చోటుకి రావడం గర్వకారణమని తెలిపింది. మీ భవిష్యత్‌కు మీరే మార్గదర్శకులని తెలిపింది. పెట్టుబడుల విషయంలో మహిళా పారిశ్రామిక వేత్తలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని అధిగమించి ముందుకుసాగాలని తెలిపింది ఇవాంకా.

ప్రపంచ ఆర్థిక ప్రగతికి దిశానిర్థేశం చేసేది ఎంటర్ ప్రెన్యూర్సేనని ఆమె అన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రగతే ప్రపంచ దేశాల ప్రగతిని నిర్దేశిస్తుందని ఆమె చెప్పారు. కొత్త కలలు, లక్ష్యాలు, టెక్నాలజీ రూపకల్పన, తయారీ భవిష్యత్ ను ముందుకు తీసుకెళ్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచ భవిష్యత్ ను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఆలోచనలు ముందుకు తీసుకెళ్తాయని ఆమె స్పష్టం చేశారు. అంత గొప్పదైన ఈ సదస్సులో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.  భారత్ లో చిన్న, మధ్య తరహా పరిశ్రామికవేత్తలు ఎక్కువగా ఉన్నారని ఆమె అన్నారు. వారి శక్తిని గొప్పగా మలచాల్సిన భాద్యత ఉందని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -