గోల్కొండ కోటలో ఇవాంక…

215
Ivanka Trump visits Golkonda Fort
- Advertisement -

జీఈ సదస్సులో భాగంగా హైదరాబాద్ నగరానికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక  గోల్కొండ కోటను సందర్శించింది. దాదాపు 40 నిమిషాల పాటు కోటలో పర్యటించింది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ కోట ప్రాశస్త్యాన్ని, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు ఇవాంకకు వివరించారు. ఇక కోటలో ఏర్పాటుచేసిన 12 స్టాళ్లను  పరిశీలించింది.ఇవాంకా సందర్శన నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

జీఈఎస్‌కు విచ్చేసిన 1500ల మంది అతిథుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విందును ఏర్పాటు చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి 10 వరకు   కార్యక్రమం జరగనుంది. తెలంగాణ వంటకాలను అతిథులకు రుచి చూపించనున్నారు. భద్రతా కారణాల రిత్యా ఈ విందులో ఇవాంక పాల్గొనడం లేదని తెలుస్తోంది. గోల్కొండ సందర్శన అనంతరం ఇవాంక ట్రైడెంట్ హోటల్‌కు చేరుకోనుంది. అనంతరం రాత్రి 9.30 గంటలకు దుబాయికి తిరుగు ప్రయాణం కానుంది.

Ivanka Trump visits Golkonda Fort

ఇంగ్లాండ్‌ రాణి ఎలిజబెత్‌-2 ప్రిన్స్‌తో కలిసి 1983 సంవత్సరం నవంబర్‌ 19న సందర్శించారు. రెండేళ్ల క్రితం డిసెంబర్‌లో మారిషస్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ ఆమీనా గరీబ్‌ఫకీం కోటను సందర్శించారు. ఇక చిన్న, చిన్న దేశాల అధినేతలు చాలా మంది సందర్శించారు. రాష్ట్రపతులు జ్ఞానీ జైల్‌సింగ్‌, ఆర్‌.వెంకటరామన్‌ గోల్కొండను సందర్శించగా తాజాగా హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇవాంక గోల్కొండను సందర్శించింది.

- Advertisement -