సుప్రసిద్ధ ఫలక్‌నుమ ప్యాలెస్‌కు చేరుకునున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు.
ప్రధాని మోదీతో పాటు ఇవాంకా, గవర్నర్ నరసింహన్, కేసీఆర్ పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. విదేశీ ప్రతినిధులు బస్సుల్లో ప్యాలెస్‌కు చేరుకుని భారతీయ వంటకాలు రుచి చూశారు. ఈ విందు నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షణ్ణంగా పరిశీలించారు.
101 మంది కూర్చునే టేబుల్ పై ఇవాంకా విందులో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి శోభా కామినేని, ప్రతాప్ సి రెడ్డి, బీవీ మోహన్‌రెడ్డి, ఉపాసన, సంజయ్‌బారులకు ఆహ్వానం అందించారు. ఈ విందులో ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యానీని విదేశీ అతిథులకు రుచి చూపిస్తున్నారు.