ఐటీసీ ఫుడ్స్ ఇకపై ఇంటికే డెలివరీ..!

420
itc brands
- Advertisement -

భారతదేశ అతిపెద్ద, పిజ్జా డెలివరీ బ్రాండ్ అయిన డోమినాస్ పిజ్జా, భారత దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న ప్యాకేజ్డ్ ఫుడ్ సంస్థల్లో ఒకటైన ఐటీసీ ఫుడ్స్ భాగస్వామ్యంతో ‘డోమినోస్ ఎసెన్షియల్స్’ను ప్రారంభించింది. ఐటీసీ ఫుడ్స్ నిత్యావసరాలను డెలివరీ చేయడంలో సహాయపడేందుకు డోమినోస్ డెలివరీ మౌలికవసతులను వినియోగించుకోనున్నారు.

ఆశీర్వాద్ అట్టాతో పాటుగా కారంపోడి, మెంతులపొడి, పసుపులతో సహా మసాలాలు కాంబో ప్యాక్ గా డోమినోస్ యాప్ ద్వారా నేటి నుంచి లభ్యం అవుతాయి. మొదట ఈ సేవలు బెంగళూరులో లభ్యమవుతాయి. ఆ తరువాత హైదరాబాద్, నోయిడా, ముం బై, కోల్ కతా, చెన్నై లలో లభ్యం కానుంది. ఒక క్యూఎస్ఆర్ మరియు ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ మధ్య ఈ తరహాలో మొదటి, విశిష్ట భాగస్వామ్యం ఇది.

ఈ సేవలను పొందేందుకు వినియోగదారులు డోమినోస్ యాప్ తాజా వెర్షన్ ను వినియోగించి, డోమినోస్ ఎసెన్షియల్స్ సెక్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు కస్టమర్లు కాంబో ప్యాక్ ను ఎంచుకోవచ్చు మరియు డిజిటల్ చెల్లింపు చేయడం ద్వారా ఆర్డర్ చేయ డాన్ని పూర్తి చేయవచ్చు. డొమినోస్ సేఫ్ డెలివరీ ఎక్స్ పర్ట్ ఈ ప్యాకేజ్ ను జీరో కాంటాక్ట్ డెలివరీ విధానం కింద అందిస్తారు. సేఫ్ డెలివరీ ఎక్స్ పర్ట్ తో కాంటాక్ట్ లోకి రావాల్సిన అవసరం లేకుండానే తమ ఆర్డర్ ను తీసుకునేందుకు ఈ సర్వీస్ విధానం కస్టమర్లకు వీలు కల్పిస్తుంది.

- Advertisement -