హైదరాబాద్ బిర్యానీ @ డొమినోస్ పిజ్జా

121
hyderabad biryani

డొమినోస్ పిజ్జా బిర్యానీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే సరికొత్త రుచులతో పిజ్జాలను మాత్రమే అందిస్తున్న డొమినోస్ ఇకపై ఏక్ దమ్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల రుచులను ప్రజల ముందుకు తీసుకురానుంది.

20 ర‌కాల బిర్యానీ రుచులు…హైద‌రాబాదీ నిజామీ బిర్యానీ, ల‌క్న‌వీ న‌వాబీ బిర్యానీ, కోల్‌క‌తా బిర్యానీ, బ‌ట‌ర్ చికెన్ బిర్యానీలాంటివి ఉన్నాయి. బిర్యానీతోపాటు క‌బాబ్‌లు, కూర‌లు, బ్రెడ్స్‌, రైతాలు, చ‌ట్నీలు, డెజ‌ర్ట్‌లు కూడా తీసుకురావాల‌ని జేఎఫ్ఎల్ నిర్ణ‌యించింది.

అయితే తొలుత కేవలం గురుగ్రామ్‌లోని మూడు రెస్టారెంట్లలో మాత్రమే అందుబాటులోకి తీసుకురాగా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తమని పేర్కొంది ఆ సంస్ధ. ఏక్‌ద‌మ్ బిర్యానీ కేవ‌లం రూ.99 నుంచే అందుబాటులో ఉంటుంద‌ని కూడా సంస్థ ప్ర‌క‌టించింది.