బాహుబలి నిర్మాతలపై ఐటీ దాడులు

322
IT Raids on Baahubali producers
- Advertisement -

తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా రాజమౌళి వండర్ బాహుబలి. బాహుబలి సినిమాకు ముందు తర్వాత అనే రేంజ్‌లో తెలుగు సినిమా స్థాయి, మార్కెట్‌ పెరిగింది. అంతర్జాతీయంగా చైనా సహా పలు దేశాల్లో ఈ చిత్రం సూపర్‌ సక్సెస్‌ను సాధించింది. బాహుబలి 650 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసింది. దీంతో ఐటీ శాఖ కన్ను బాహుబలి నిర్మాతలపై పడింది. సినిమా విడుదలై సంవత్సరం కావాస్తున్న సరైన ఐటీ పత్రాలు సమర్పించకపోవటంతో ఐటీ శాఖ బాహుబలి నిర్మాతల ఇళ్లపై దాడులు చేసినట్లు తెలుస్తోంది.

ఏకకాలంలో బాహుబలి నిర్మాతలు శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లు,ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు 200 కోట్లు ఖర్చు అయిందని నిర్మాతలు చెబుతున్న ఇందులో వాస్తవం లేదని ఐటీశాఖ భావిస్తోంది. మరోవైపు సినిమా లాభం కూడా ఇంతకు మించి ఉండటంతో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా, భారతీయ సినీ పరిశ్రమలో బ్లాక్ మనీ వినియోగంపై పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.గతంలో ఎన్‌టిఆర్‌, మహేష్‌ బాబు చిత్రాలకు ఇలాంటి చర్చ జరిగితే.. అప్పట్లో నిర్మాత బండ్ల గణేష్‌పై ఐటి దాడులు కూడా జరిగాయి.

- Advertisement -