మా అమ్మవల్లే ఈ స్థాయిలో ఉన్న-కేటీఆర్

211
IT Minister KTR tweets Happy Mothers Day Amma
- Advertisement -

నేడు మధర్స్ డే సందర్భంగా ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అమ్మపై ప్రేమను తెలియజేస్తున్నారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్… ట్విట్టర్ వేదికగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ కేటీఆర్ తన తల్లిదండ్రులతో కలిసి దిగిన చిన్న నాటి ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు ఏది సాటి రాదని తెలిపారు. నేడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది మా అమ్మ వల్లే అన్నారు. నాకు తెలిసిన అత్యంత శక్తివంతమైన వ్యక్తి మా అమ్మే అంటూ ట్వీట్ చేశారు.

మరో నేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా అమ్మలందరకి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి విజయమ్మకు అభినందనలు తెలిపారు. ఈ ప్రపంచంలో అమ్మతనాకి మించిన హీరోయిజం లేదన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి మా అమ్మే కారణమనంటూ ట్వీట్ చేశారు. మరోవైపు నేటితో జగన్ పాదయాత్ర 160వ రోజుకు చేరింది. కైకలూరు శివారు ప్రాంతం నుంచి ప్రారంభించిన ఆయన, రాత్రి మహేశ్వరపురంలో బస చేయనున్నారు.

- Advertisement -