ప్రభుదేవాతో పెళ్లి విషయంపై స్పందించిన నికీశా..

268
Nikesha Patel respond on Prabhu Deva to marry..
- Advertisement -

తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా పులి’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన గుజరాతీ బ్యూటీ నికీషాపటేల్‌. తాజాగా ఈ అమ్మడు కొరియేగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు వస్తున్న వార్తలు ఎంత హల్‌చల్ చేస్తున్నాయి అందరి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విలేకిరి ప్రభుదేవాతో కలిసి పనిచేయాలనుకుంటున్నారా? అని అడిగితే నటించడం ఏంటీ నేను ఆయనతో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అన్నట్లు వార్తలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

Nikesha Patel respond on Prabhu Deva to marry..

ఈ వార్త సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తూ వైరల్‌గా నిలిచింది. తాజాగా ఇదే అంశంపై ఈ బ్యూటీ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ‘ప్రభుదేవా సర్‌ను నేను పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై మీడియా అనవసరంగా రాద్దాంతం చేస్తుంది . ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పడొస్తున్న ఆ వార్తలో అస్సలు నిజం లేదు. నేను ఆయనను కాదు ఎవ్వరినీ పెళ్లి చేసుకోవడం లేదు. ఆయన నాకు శ్రేయోభిలాషి మాత్రమే. నేను ప్రభుదేవాను సర్‌ అని పిలుస్తాను’ అని తన పీఆర్‌వోతో క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘తేరీ మెహర్బానియా 2’ అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు.

- Advertisement -