అందరూ చేనేత వ‌స్త్రాలు ధ‌రించాలి…

229
Ktr Chenetha
- Advertisement -

చేనేత రంగానికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. భారతీయుల జీవితంతో పెనువేసుకొని, భారతీయుల సంస్కృతికి అది అద్దం పడుతుంది. భారతీయ చేనేత కళాకారుల సృజన అద్భుతమైనది.

వస్ర్తాలు నేయడంలో వారి ప్రతిభ అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరను నేసిన ఘనత భారత చేనేత కళాకారులది. ఇంతటి ఘనచరిత్ర కలిగిన చేనేత సంబురాలు హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత సంబురాలు ఘ‌నంగా జ‌రిగాయి.

Ktr Chenetha

జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ వేడుక‌కు హాజ‌ర‌యిన మంత్రి కేటీఆర్.. ఈ సంద‌ర్భంగా చేనేత‌ వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌నను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ప్ర‌తి ఒక్క‌రు చేనేత వ‌స్త్రాలు ధ‌రించాల‌ని పిలుపునిచ్చారు. చేనేత‌ను ప్రోత్స‌హించేలా అంద‌రితో మంత్రి ప్ర‌తిజ్ఞ చేయించారు.

దేశంలో వ్య‌వ‌సాయ రంగం త‌ర్వాత ఎక్కువ మందికి ఉపాధి క‌ల్పిస్తున్న, క‌ల్పిస్తున్నది చేనేత రంగ‌మ‌ని మంత్రి తెలియ‌జేశారు. చేనేత కార్మికుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపిన కేటీఆర్‌, చేనేత‌కు రూ. 1280 కోట్ల బ‌డ్జెట్ కేటాయించామ‌ని చెప్పారు. అనంతరం వీవ‌ర్ జిందాబాద్ పుస్త‌కాన్ని, తెలంగాణ చేనేత మ‌ర‌నేత వైభ‌వ గీతాల సీడీని మంత్రి ఆవిష్క‌రించారు.

Ktr Chenetha

- Advertisement -