ISRO: అంతరిక్షం నుండి మహాకుంభమేళా ఫోటోలు

0
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లోని మహాకుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే 9 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఈసారి కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

కుంభమేళాకు సంబంధించి కొన్ని చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తాజాగా విడుదల చేసింది. స్పేస్‌ సెంటర్‌ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. . ఈ నెల 10న తీసిన ఫొటోల్లో ఓ పెద్ద నగరాన్ని తలపించేలా మహాకుంభ్‌ ప్రాంతం దర్శనిమచ్చింది.

ఫిబ్రవ‌రి 26వ తేదీన మ‌హాశివ‌రాత్రితో కుంభమేళా ముగియనుంది. ల‌క్షా 50 వేల టెయిలెట్లను నిర్మించారు. దాదాపు 15వేల మంది శానిటేస‌న్ వ‌ర్కర్లు పనిచేయ‌నున్నారు. 1250 కిలోమీట‌ర్ల దూరం పైప్‌లైన్ వేశారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, రెండు వేల సోలార్ లైట్లు, మూడు ల‌క్షల వృక్షాల‌ను ఏర్పాటు చేశారు.

Also Read:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు

- Advertisement -