- Advertisement -
సిరియా – ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్దవాతావరణం నెలకొంది. సిరియాపై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. దీంతో సిరియా రాజధాని డమాస్కస్ బాంబుల మోతతో దద్దరిల్లింది. అర్థరాత్రి బాంబుల వర్షంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
సిరియాలో 2011 నుంచి అంతర్యుద్ధం జరుగుతున్నది. దీనిని అదనుగా చేసుకున్న ఇజ్రాయెల్.. సిరియాలో వైమానిక దాడులకు పాల్పడుతోంది. దీంతో ఇప్పటివరకు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోగా లక్షల కొద్ది మంది దేశం విడిచిపోయారు.
- Advertisement -