బాలీవుడ్ లోకి “ఇస్మార్ట్ శంకర్”

405
Ismart Shankar
- Advertisement -

రామ్ పొత్తినేని హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నభా నటేశ్, నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా నటించిన ఈచిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌ బ్యానర్ పై నిర్మించారు. మణిశర్మ సంగీతం ఈమూవీకి హైలెట్ గా నిలిచిందని చెప్పుకోవాలి. ఈమూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రామ్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది.

తాజాగా ఉన్నసమాచారం ప్రకారం ఈమూవీకి బాలీవుడ్ లో రిమేక్ కానుందని తెలుస్తుంది. ఇందుకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. బాలీవుడ్ లో హీరోగా రణ్ బీర్ కపూర్ నటిస్తాడట. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ తర్వాతి చిత్రం రౌడి హీరో విజయ్ దేవరకొండతో చేయనున్నారు. ప్రస్తుతం ఈమూవీకి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నాడు పూరీ. ఈసినిమాను కూడా పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. వచ్చె నెలలో ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

- Advertisement -