సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి గంగుల..

456
Gangula Kamalakar
- Advertisement -

రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహారపౌరసరఫరాలశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కరీంనగర్‌ శాసనసభ్యుడు గంగుల కమలాకర్‌ ఈ రోజు ఖైరతాబాద్‌లోని బీసీ కమీషన్‌ భవన్‌లోగల తన కార్యాలయంలో విధులను చేపట్టారు. ఈనెల 8న రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గంగుల కమలాకర్‌ వివిధ కార్యక్రమాల్లో అధికారికంగా, విస్తృతంగా పాల్గొంటున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 26 రోజులకు తన కార్యాలయంలో అధికారిక విధులను స్వీకరిస్తున్నారు.

కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై హాట్రిక్‌ సాధించిన గంగులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించి మంత్రి పదవిని కట్టబెట్టారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

kcr

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. నాకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు. రెండు శాఖల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సేవచేసే అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి నాపై పెట్టుకున్న నమ్మక వమ్ము చేయను. ముఖ్యమంత్రి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చారు. ఖరీఫ్‌లో ధాన్యం పెరిగే అవకాశం ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి అన్నారు.

అలాగే ప్రతి పేద బిడ్డని ముఖ్యమంత్రి ఆదుకుంటారు అని నమ్మకం కలిగింది. ఒక్క బియ్యం గింజ నల్లబజారుకు తరలకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతి బిడ్డ చదువుకోవలని గురుకులాలు తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా చూసుకుంటామని మంత్రి కమలాకర్‌ పేర్కొన్నారు.

- Advertisement -