వైసీపీలో జగన్ టార్గెట్ అయ్యారా?

34
- Advertisement -

ఏపీలో ఎన్నికల ముందు అధికార వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలే ఈసారి 175 స్థానాల్లో విజయం సాధించాలని అధినేత జగన్ టార్గెట్ పెట్టుకున్న వేళ.. పార్టీలోని ఎమ్మేల్యేలు ఒక్కొక్కరుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వస్తున్నారు. తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణరెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. అయితే ఆర్కే బయటకు వచ్చిన కొద్ది సేపటికే మంగళగిరి వైసీపీ ఇంచార్జ్ గా గంజి చిరంజీవిని నియమించడం మరింత చర్చనీయాంశం అయింది. ఇక అటు గాజువాక పార్టీ ఇంచార్జ్ దేవన్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో గాజువాక పార్టీ ఇంచార్జిగా గుడివాడ అమర్నాథ్ ను నియమించినట్లు సమాచారం.

ఇదిలా ఉంచితే గతంలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి వంటి వారు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇలా ఎన్నికల ముందు ఒక్కొక్కరూ వైసీపీ విడుతుండడం కొత్త చర్చలకు తావిస్తోంది. పైగా బయటకు వచ్చిన ప్రతిఒక్కరు కూడా వైఎస్ జగన్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండడం గమనార్హం. దీంతో పార్టీలో జగన్ వైఖరి నచ్చకే ఎమ్మేల్యేలు బయటకు వస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

అయితే దాదాపు 40 మంది ఎమ్మేల్యేలు జగన్ తీరుపై తీవ్ర అసహనంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నప్పటికి ఎలాంటి ప్రదాన్యం ఇవ్వడం లేదని, నియంత వైఖరిలో జగన్ ఉన్నట్లు బయటకు వచ్చిన ఎమ్మేల్యేలు చెబుతున్నారు. ఇంకా ముందు రోజుల్లో పార్టీ వీడే వారి సంఖ్య మరింత పెరుగుతుందనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీలో కొంతమంది ఎమ్మేల్యేలు పార్టీ అధినేతను టార్గెట్ చేశారా ? అందుకే ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మరి పార్టీ అంతర్గత సమస్యలను అధినేత వైఎస్ జగన్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Also Read:జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?

- Advertisement -