RRR:రఘురామకు వైసీపీనే దిక్కా?

20
- Advertisement -

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడనేది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. అయితే ఆ తర్వాత పార్టీపై వ్యతిరేక గళం వినిపిస్తూ జగన్ పాలనపై విమర్శలు చేస్తూ రెబల్ ఎంపీగా మారారు. అప్పటి నుంచి రఘురామ వర్సెస్ వైసీపీ అంశం నిప్పు ఉప్పులా మారింది. ఇక ఏపీలో ఎలక్షన్ ఫీవర్ నడుస్తుండడంతో ఈసారి ఎన్నికల వేళ రఘురామ పార్టీ మారతారా ? ఒకవేళ పార్టీ మారితే ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు ? అనే ప్రశ్నలు తరచూ వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఆయన బీజేపీలో చేరతారనే టాక్ గట్టిగానే వినిపించింది.

కూటమిలో భాగంగా నర్సాపురం టికెట్ తనకే వస్తుందని ఓ బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ ముందే రఘురామ కృష్ణరాజు నొక్కి చెప్పారు. కానీ అనూహ్యంగా నర్సాపురం కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత శ్రీనివాస్ వర్మకు ఎంపీ టికెట్ కేటాయించారు. దీంతో రఘురామకు గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఆయన ఆశించిన టికెట్ రాకపోవడంతో రఘురామ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. తనకు టికెట్ దక్కకపోవడంపై తాజాగా రఘురామ స్పందిస్తూ.. తను కచ్చితంగా పోటీ చేస్తానని అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని, ఎంపీ లేదా ఎమ్మెల్యే గా పోటీ చేసే దానిపై కూడా అతి త్వరలోనే చెబుతానని స్పస్టతనిచ్చారు రఘురామ.

అయితే కూటమి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ రఘురామ.. మళ్ళీ వైసీపీ వైపే చూస్తున్నాడా అనే టాక్ కూడా వినిపిస్తోంది. వైసీపీలో ఆయన సభ్యత్వం అలాగే కొనసాగుతుండడంతో సొంత పార్టీ నుంచే బరిలో దిగే ఆలోచన చేసే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. అయితే తరచూ పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే రఘురామపై జగన్ ఎంతవరకు సానుకూలత చూపిస్తాడనేది ప్రశ్నార్థకం. మరి రఘురామ దారి ఎటువైపు ఉండబోతుందో చూడాలి.

Also Read:Harish:ఎస్‌బీ ఆర్గానిక్స్‌ పై క్రిమినల్ కేసు పెట్టాలి

- Advertisement -