YCP:వైసీపీ కాన్ఫిడెన్స్ తగ్గిందా?

12
- Advertisement -

ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తామని వైసీపీ మొదటి నుంచి ధీమాగా చెబుతూ వచ్చింది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తమ టార్గెట్ 175 అని పదే పదే చెబుతూ వచ్చారు. అయితే ఈ రకమైన కాన్ఫిడెన్స్ రాజకీయ నాయకులకు సహజమే అయినప్పటికి వైసీపీ చెబుతున్న వైనాట్ 175 ఓవర్ కాన్ఫిడెన్స్ అనే అభిప్రాయాలు వ్యక్తమౌతూ వచ్చాయి. వైనాట్ 175 టార్గెట్ ఒకింత వైసీపీపై విమర్శలు వ్యక్తమయ్యేలా చేసినప్పటికీ జగన్ మాత్రం అదే మాటపైనే ఉంటూ వచ్చారు. అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్ది వైసీపీ టార్గెట్ లో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా స్పందిస్తూ ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ 125 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకప్పుడు వైనాట్ 175 అని చెప్పిన నేతలే ఇప్పుడు వెనక్కి తగ్గుతుండడంతో వైసీపీలో విన్నింగ్ కాన్ఫిడెన్స్ లోపించిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ నేతల్లో కాన్ఫిడెన్స్ తగ్గడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటివరకు బయటకు వచ్చిన సర్వేలన్నీ మిశ్రమ ఫలితాలనే వెల్లడిస్తు వచ్చాయి. దాంతో వైసీపీ పాలనపై ప్రజా వ్యతిరేకత ఉందనే సంగతి ఆ పార్టీ నేతలకు కూడా అర్థమైనట్లు తెలుస్తోంది.

అధినేత జగన్ కూడా అభ్యర్థుల ఎంపికలో భారీగా మార్పులు చేయడం, ఆయన ప్రసంగాల్లో పార్టీ గెలుపుపై పెద్దగా ధీమా చూపించకపోవడం వంటి కారణాలతో వైనాట్ 175 టార్గెట్ ను వైసీపీ మెల్లగా పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఏ మాత్రం ప్రతికూల ఫలితాలు వచ్చిన.. వైనాట్ 175 అనేది పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావన కూడా జగన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గతంలో క్లీన్ స్వీప్ పై చూపించిన కాన్ఫిడెన్స్ .. ఎన్నికల ముందు చూపించడం లేదనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి గెలుపు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:రికార్డులు క్రియేట్ చేస్తున్న..పుష్ప‌-2

- Advertisement -