ఈ మొబైల్ యుగంలో మోస్ట్ కమ్యూనికేషన్ మెసెంజింగ్ యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలిగ్స్.. ఇలా ఎవరితో కమ్యూనికేట్ కావాలన్న ఎక్కువగా వాట్సాప్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ అవుతుంటాము. దీనిని ఉపయోగించి ఫోటోస్, చిన్న చిన్న వీడియోస్.. షేర్ చేయడం, ఆఫీస్ ఫైల్స్ ఒకరికి ఒకరు షేర్ చేసుకోవడం ఇలా చేస్తుంటాము. అందుకే ప్రతి ఒక్కరి మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాట్సాప్ బ్యాన్ అవుతూ ఉంటుంది. .
ఇలా బ్యాన్ అవ్వడానికి చాలానే కారణాలు ఉన్నాయి. వాట్సాప్ ద్వారా ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడడం, సెక్స్వాల్ కంటెంట్ ను షేర్ చేయడం, గ్రూప్స్ లలో మాల్వేర్ కు సంబంధించిన సైట్స్ షేర్ చేయడం.. ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం వల్ల మీ మొబైల్ నెంబర్ యొక్క వాట్సాప్ బ్యాన్ అవుతూ ఉంటుంది. దీంతో చాలామంది బ్యాన్ అయిన వాట్సాప్ మొబైల్ నెంబర్ ను పక్కన పెట్టి వేరే నెంబర్ తో కొత్త వాట్సాప్ క్రికెట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా బ్యాన్ అయిన వాట్సాప్ ను తిరిగి రికవరీ చేసుకునే వీలుంది అదెలాగో చూద్దాం !
* ముందుగా ఏ మొబైల్ నెంబర్ పై వాట్సాప్ బ్యాన్ అయిందో ఆ మొబైల్ నెంబర్ యొక్క ఆఫీస్ కు వెళ్ళి అదే నంబర్ పై వేరే సిమ్ తీసుకోవాలి.
* ఆ సిమ్ యాక్టివేట్ అయిన తరువాత మీ మొబైల్ లో కాకుండా మీ యొక్క ఫ్రెండ్స్ లేదా పేరెంట్స్ యొక్క మొబైల్ లో వేసి వాట్సాప్ యాప్ ఇన్ స్టాల్ చేయాలి.
* ఆ తరువాత ఏదైనా బ్రౌజర్ లోకి వెళ్ళి వాట్సాప్ సపోర్ట్ ( whatsapp support ) అని టైప్ చేసి వాట్సాప్ యొక్క అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళాలి
* అక్కడ కాంటాక్ట్ ( contact ) లోకి వెళ్ళి బ్యాన్ అయిన మొబైల్ నెంబర్, కంట్రీ కోడ్, ఈ మెయిల్.. etc ఇవ్వాల్సి ఉంటుంది.
* ఆ తరువాత కాస్త కిందకు స్క్రోల్ చేసి మీ యొక్క వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయిన కారణాలు, తిరిగి పొందేందుకు సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
* మీరిచ్చిన సమాచారం కచ్చితమైనదే అయితే 24 గంటల్లో బ్యాన్ అయిన వాట్సాప్ అకౌంట్ తిరిగి పొందవచ్చు.
Also Read:సిద్దు-విజయ్.. బాక్సాఫీస్ వార్!