తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొనలేదనే వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు కేటీఆర్. తానేమీ ఆకాశం నుంచి ఉడిపడలేదని 8 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు. 2006 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని గుర్తులను నెమరువేసుకున్న కేటీఆర్ స్కాంగ్రెస్ నేతలకు గట్టి సమాధానం ఇచ్చారు.
Want to refresh the memory of some Telangana Scamgress men who keep hallucinating that I landed straight into a ministry in 2014
Where were you when I was in the movement for 8 years (2006-14) alongside people of Telangana?
Guess you were busy plotting to suppress the agitation pic.twitter.com/536tQlXB2s
— KTR (@KTRTRS) October 15, 2018
కొందరు స్కాంగ్రెస్ నేతలు నేను 2014లో నేరుగా మంత్రినయ్యానంటూ ఎద్దేవా చేస్తున్నారు. అసలు ఉద్యమంలోనే పాల్గొనలేదని అంటున్నారు. నిరసనల వేళ, అడ్డుకట్టలను దాటేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరో మీరే చూడండి అంటూ ఫోటోలను పోస్టు చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేటీఆర్‌కు మద్దతుగా నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఎవడురా ….కేటీఆర్ గారు ఉద్యమం చెయ్యకుండా …ప్రజల పక్షాన పోరాటం చెయ్యకుండా …మంత్రి పదవిలో కూర్చున్నాడని విమర్శించే సన్నాసులు.
దమ్ముంటే ….మీ పోరాట రుజువులు బయటపెట్టండి ?? @KTRTRS
@UttamTPCC#TelanganaWithKCR #ISupportKTR#TelanganaElections2018 pic.twitter.com/HR46kCUiua— Srinath Goud (@SRINATH_TRS) October 16, 2018