రైతు సమస్యలపై రేణుదేశాయ్..!

274
- Advertisement -

సమాజంలో జరుగుతున్న మంచిచెడులపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిప్రాయం వెల్లడిస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్. తాను ఏదీ చేసినా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. పవన్ కళ్యాణ్‌తో విడిపోయినప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతోనే ఉంటున్న ఆమె ఇటీవల పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. అంతేకాదు.. గ్రాండ్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫోటోలు కూడా షేర్ చేసింది. ఇక త్వరలోనే రేణూ మరోసారి పెళ్లి పీటలెక్కనుంది.

తాజాగా రైతుల సమస్యలపై రేణుదేశాయ్ స్పందిచడమే కాక.. ఓ ట్రైలర్ ను విడుదల చేసి ప్రతిఒక్కరూ ఈ ట్రైలర్ ను చూడాలని కోరింది. దేశంలోని రైతులు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారని.. వారి సమస్యల ఆధారంగా తెరకెక్కించిన “మిట్టీ” చిత్ర ట్రైలర్ ను చూడాలని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ పెట్టింది. మానవాళి జీవనాధారమైన రైతుల మేలుకోరే కొందరు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ లింక్ ను తాను పంచుకుంటున్నట్లు ఆమె చెప్పింది.

ఇక దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, పంటలు పండక రైతు పడే కష్టాలు, పెట్టుబడుల కోసం చేసిన అప్పుల తీర్చలేక అన్నదాతలు ఎలాంటి కష్టాలు ఎదుర్కుంటున్నారో ఈ ట్రైలర్ లో చూపించారు. రైతు శ్రేయస్సు కోరి.. వారు పడే కష్టాలను ఈ చిత్రంలో ప్రస్తావించారు.

- Advertisement -