కాంగ్రెస్‌కు అదే సెంటిమెంట్ రిపీట్!

33
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల వేళ విజయం కోసం ప్రధాన పార్టీలన్నీ గట్టిగా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఎన్నికలు జరగకుండానే విజయం మాదేనని, డిసెంబర్ 3 ప్రమాణ స్వీకారం చేస్తామని, కళ్ళు మూసుకొని కలలు కంటున్నారు హస్తం నేతలు. అయితే వారి కలలు పగటి కలలే అనే సంగతి ఆ పార్టీ నేతలకు కూడా తెలిసిన సంగతే. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ మొదటి నుంచి కూడా మ్యాజిక్ ఫిగర్ సాధించిన దాఖలాలు అసలు లేవు. 1983 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ యాబై సీట్ల కంటే తక్కువే సాధిస్తూ వచ్చింది. అప్పటి తెలంగాణలో 107 సీట్లకు గాను 1983 లో 43 సీట్లు, 1989 లో 58 సీట్లు, 1997 లో 6 సీట్లు, 1999 లో 42 సీట్లు, 2004 లో 48 సీట్లు, 2009 లో అప్పుడున్న 119 స్థానాలకు గాను 50 సీట్లు,.

ఇక రాష్ట్రం విడిపోయిన తరువాత 20 స్థానాలకు అటు ఇటు సాధిస్తూ వచ్చింది. ఈ ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ బలంగా ఉన్న రోజుల్లో కూడా మ్యాజిక్ ఫిగర్ సాధించిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను అసలు నమ్మే పరిస్థితి లేదనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది. ఈసారి హస్తం పార్టీకి అదే సీన్ రిపీట్ అవుతుందనడంల ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పై పైకి విజయం పై తాటకు చప్పుళ్ళు చేస్తున్నప్పటికి లోలోపల ఆ పార్టీ విజయంపై సొంత పార్టీ నేతలే కాన్ఫిడెంట్ గా లేని పరిస్థితి. ఆచరణకు యోగ్యం కానీ హామీలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్శించేందుకు చేస్తున్న ప్రయత్నలాన్ని హస్తం నేతల కుయుక్తులే అనే సంగతి యావత్ తెలంగాణ ప్రజానీకానికి బాగా తెలిసిన విషయం. కాబట్టి ఎప్పటిలాగే ప్రజలు హస్తం పార్టీకి బుద్ది చెబుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:KTR:బీజేపీ పని ఖతం

- Advertisement -