కర్ణాటక నూతన సీఎం ఎవరనేదిపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రాగా సీఎం ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అన్ని సమీకరణాలను పరిశీలించిన అనంతరం కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్య వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లతో వేర్వురు భేటీ అనంతరం సీఎంగా సిద్దరామయ్యను ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
రేపు సీఎంగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక డీకే శివకుమార్‌కు కీలక శాఖలతో పాటు డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. అలాగే కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా డీకే పనిచేయనున్నారు. రేపు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం అయ్యే అవకాశం ఉంది. అనంతరం కర్ణాటక సీఎల్పీ నాయకుడిగా సిద్దరామయ్యను ఎన్నుకోనున్నారు.
Also Read:సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ..
మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ 134,బీజేపీ 65,జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు.ఇక కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.
Also Read:బిజినెస్‌లోకి ఎన్టీఆర్ ఎంట్రీ