బిజినెస్‌లోకి ఎన్టీఆర్ ఎంట్రీ

62
- Advertisement -

జూనియర్ ఎన్ఠీఆర్ కి నటనలోనే కాదు, బిజినెస్ లోనూ మంచి విషయం ఉంది. ఎక్కడ ఎలా ఎదగాలో జూనియర్ కి వెన్నతో పెట్టిన విద్య. అందుకే, రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ రాణిస్తాడు అని చాలా మంది నమ్మకం. ఐతే, ఎన్టీఆర్ రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉంటున్నాడు. ఈ లోపు సినిమాలతో పాటు బిజినెస్ లోనూ అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి ఓ స్టూడియో నిర్మాణానికి ఎన్టీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ సమీపంలో స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ పనులు మొదలు పెడుతున్నారని అంటున్నారు.

ఈ స్టూడియోలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్రేన్లు, కెమెరాలను అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగులకు వాటిని రెంట్ కి ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది తెలియాల్సి ఉంది. ఐతే, బిజినెస్ లో ఎన్టీఆర్ ఎంట్రీ అనేది ఆల్ మోస్ట్ ఖరారు అయినట్టే. తారక్ రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడులు పెడుతున్నాడు.

Also Read:ఈ ఆసనం వేస్తే ఆ సమస్యలు దూరం!

ఇప్పటికే గుంటూరు జిల్లాలో వినుకొండ సమీపంలోని ఓ ఏరియాలో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు స్టూడియో నిర్మాణం వైపు ఎన్టీఆర్ అడుగులు పడుతున్నాడు. త్వరలో ఏపిలో కూడా తాను కొనుగోలు చేసిన ఆ భూముల్లో కూడా ఓ భారీ స్టూడియో కట్టాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. అలాగే హోటల్ బిజినెస్ లోకి కూడా ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Also Read:హ్యాపీ బర్త్ డే..ఛార్మి

- Advertisement -