ఆర్ఎస్‌ఎస్‌తో దేశానికి పెను ముప్పు?

57
- Advertisement -

హిందుత్వ వాదమే ప్రాధాన ఎజెండాగా ఆర్ ఎస్ ఎస్ పని చేస్తుందనే విషయం తెలిసిందే. అయితే హిందూత్వాన్ని చాటిచెప్పడం తప్పు కాదు కానీ ఇతర మతాలపై కూడా హిందూత్వాన్ని రుద్దడం, ఇతరులను బలవంతంగా హిందూత్వం వైపు ఆకర్షించడం వంటి విధానాలు మత సమానాత్వాన్ని దెబ్బతీయడమే అనే వ్యతిరేక వాదన ఆర్ ఎస్ ఎస్ పై ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. హిందుత్వానికీ పెద్దపీట వేయడంలో ప్రధాని నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షా ముందుండడంతో హిందువాదం పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో ఆర్ ఎస్ ఎస్, భజరంగ్ దళ్ వంటి సంస్థల ఆగడాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

Also Read:తలసేమియా డే:ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?

ఇదిలా ఉండగా కర్నాటక ఎన్నికల నేపథ్యంలో మతవిద్వేషాలకు కేంద్రంగా భజరంగ్ దళ్, ఏం ఐ ఏం వంటి సంస్థలు పని చేస్తున్నాయని తాము అధికారంలోకి రాగానే ఆ సంస్థలను రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ ఏకంగా మేనిఫెస్టోలోనే చెప్పింది. దీంతో ఈ అంశం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు దేశంలో ఆర్ ఎస్ ఎస్ ను కూడా బ్యాన్ చేయాలనే వాదన కూడా పెరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై సిపిఎం జాతీయ నేత బృందాకారత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అస్థిర రాజకీయాలకు, ఆర్ ఎస్ ఎస్ కేంద్రంగా మారిందని, ఆర్ ఎస్ ఎస్ విధానాలు దేశానికి పెను ముప్పు అంటూ ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Also Read:Chalapathi Rao:ఇండస్ట్రీలో చెరగని ముద్ర

ఎజెండాతో ఆర్ ఎస్ ఎస్ భావాలను గిరిజనుల్లో బలవంతంగా జొప్పించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆమె మండి పడ్డారు. ఈమె చెప్పెన మాటల్లో కొంతమేర వాస్తవాలు లేకపోలేదు. సర్వ మాటల సమ్మేళనంగా ఉన్న మన దేశంలో అన్నీ మాటలకు ప్రదాన్యత ఇవ్వాలసిన అవసరత ఎంతైన ఉంది. కానీ బీజేపీ మాత్రం కేవలం హిందూ మతానికి మాత్రమే అధిక ప్రదాన్యం ఇస్తూ ఆర్ ఎస్ ఎస్, భజరంగ్ దళ్ వంటి సంస్థల ద్వారా మతవిద్వేషాలకు చోటిస్తోంది. అందుకే ఈ సంస్థలను నిషేడిచాలనే డిమాండ్ పెరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారితే ఈ హిందుత్వ సంస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.

- Advertisement -