రామ మందిర్.. ఎన్నికల వ్యూహమేనా?

23
- Advertisement -

జనవరి 22 న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా రామ మందిరం గురించిన చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 1800 కోట్లు ఖర్చు కాగా.. ఇంత బడ్జెట్ కేటాయించి ఆలయ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏముందనే వారు కూడా లేకపోలేదు.. అయితే ఆలయ నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో నుంచి కాకుండా విరాళాల ద్వారా సేకరించిన డబ్బుతోనే నిర్మాణం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంచితే అయోధ్య రామ మందిరం వెనుక ఏమైనా పోలికల్ స్ట్రాటజీ ఉందా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే ఈ ఏడాది ఏప్రెల్ లేదా మే లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఎన్నికల్లో గెలవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈసారి ఏకంగా 400 సీట్లకు పైగా గెలవాలని టార్గెట్ పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో దేశ ఓటర్లను ఆకర్షించేందుకు అయోధ్య రామమందిరాన్ని ఒక రాజకీయ అస్త్రంలా బీజేపీ వాడుకోనుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రామమందిరాన్ని ఎన్నో ప్రత్యేకతలతో 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. పైగా ఈ ఆలయం యొక్క విశిష్టతను రాబోయే తరాలు చెప్పుకునేలా మరో 1000 వరకు ఫదిలంగా ఉండేలా ఆలయ నిర్మాణం జరిగింది. ఇదంతా కూడా బీజేపీ అధికారం వల్లే సాధ్యమైందని హిందూ ఓటర్లను బీజేపీ ఆకర్షించే అవకాశం లేకపోలేదు. అందుకే సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు ఆలయ ప్రారంబొత్సవాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా రామమందిరాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకునే అవకాశం ఉందని ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి రామ మందిరం చుట్టూ కూడా రాజకీయ వేడి అలుముకుంది. మరి ఎన్నికల సమయంలో ఈ వేడి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

Also Read:భోజనానికి ముందు పెరుగు తింటే?

- Advertisement -