IPL 2024 :ముంబై బోణి కొట్టేనా?

47
- Advertisement -

నేటి ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై హోమ్ గ్రౌండ్ అయిన వాఖాండే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలవడం ఆ జట్టుకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే గత రెండు మ్యాచ్ లలోనూ ముంబై ఇండియన్స్ ఘోర ఓటమి చవి చూసింది. మొదట గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోగా.. ఆ తర్వాత హైదరాబాద్ సన్ రైజర్స్ చేతిలో ఏకంగా 277 పరుగులు సమర్పించుకొని మరిచిపోలేని అపజయాన్ని మూటగట్టుకుంది. దాంతో కోల్ కతాతో జరిగే ఈ మ్యాచ్ లో కచ్చితంగా భారీ విజయాన్ని సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పైగా హార్దిక్ పాండ్య కెప్టెన్సీ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఈ మ్యాచ్ లో తన కెప్టెన్సీ ప్రతిభను చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోతే ముంబై జట్టుపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లు పటిష్టంగానే ఉన్నప్పటికి కోల్ కతా వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ఆడిన రెండు మ్యాచ్ లలోను విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లోనూ కోల్ కతా సమిష్టిగా రాణిస్తుండడంతో ఈ జట్టును ఎదుర్కోవడం ముంబై ఇండియన్స్ కు కొంత కష్టమే అనేది క్రీడా విశ్లేషకులు చెబుతున్న మాట. మరి నేడు జరిగే మ్యాచ్ తో ముంబై బోణి కొడుతుందా ? లేదా కోల్ కతా హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుంటుందా అనేది చూడాలి.

నిన్న డబుల్ ధమాకా మ్యాచ్ లో మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించగా, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పై డిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read:Revanth Reddy:రేవంత్ రెడ్డిపై గుస్సా!

- Advertisement -