మద్యప్రదేశ్‌లో బీజేపీ అస్త్రం ఫలిస్తుందా?

68
- Advertisement -

ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నవంబర్ లో తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. కాగా తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాల్లో అధికారం కోసం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా మద్య ప్రదేశ్ లో ఈ రెండు పార్టీల మద్య గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికి, అధికారం మాత్రం బీజేపీని వరించింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు, బీజేపీ 109 స్థానాలు, మరో ఏడు స్థానాలను ఇతరులు గెలుచుకున్నారు..

అయితే కాంగ్రెస్ కు చెందిన జ్యోతిరాదిత్య సిందియా 22 మంది ఎమ్మెల్యేలతో సహ బీజేపీలో చేరడంతో బీజేపీ అధికారం చేపట్టింది. ఇక ఈసారి ఎన్నికల విషయానికొస్తే.. గత ఎన్నికల్లో కోల్పోయిన అధికారాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలగా ఉంది. అటు బీజేపీ కూడా తిరిగి ఈసారి పూర్తి ఆధిక్యంతో అధికారం చేపట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వేస్తున్న ప్రణాళికలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ బలం అధికంగా ఉండడంతో ఆ పార్టీని దెబ్బ కొట్టేందుకు సరికొత్తగా ఆలోచిస్తోంది కాషాయ పార్టీ. ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్న ఏడుగురు అభ్యర్థులను ఈసారి అసెంబ్లీ రేస్ లో కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో దించబోతుంది బీజేపీ. వారి ద్వారా కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టాలనేది బీజేపీ ప్లాన్. ఇక బరిలో ఆ ఏడుగురు అభ్యర్థుల నుంచే సి‌ఎం అభ్యర్థిని కూడా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే తెలంగాణలో కూడా ఈ తరహా వ్యూహాన్ని అమలు చేస్తోంది బీజేపీ. గత ఎన్నికల్లో ఎంపీ స్థానానికి పోటీ చేసిన బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ వంటి వారిని ఈసారి అసెంబ్లీ బరిలో నిలిపింది. వారి గెలుపు విషయంలో పార్టీలో కూడా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడే అదే వ్యూహాన్ని మద్య ప్రదేశ్ కూడా అమలు చేస్తుండడంతో అక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే భయం పార్టీ నేతలను వెంటాడుతోందట.

Also Read:అసెంబ్లీ ఎన్నికలకు నోటీఫికేషన్..

- Advertisement -