నామినేషన్స్ షురూ.. కండిషన్స్ అప్లై!

26
- Advertisement -

తెలంగాణ ఎలక్షన్ హీట్ ఏ స్థాయిలో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. ఈ నెల 30న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని సీట్లు తప్పా దాదాపు అన్నీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి ప్రధాన పార్టీలు. ఇక ఈ ఎలక్షన్ హీట్ తారస్థాయికి చేరుకునేలా నేటి నుంచి నామినేషన్స్ దాఖలు కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఆ తరువాత 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 15 లోపు నామినేషన్ల ఉపసంహరణ చేసుకునే వీలు ఉంటుంది. .

ఇక 30న పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్ల పర్వం షురూ కావడంతో బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు ఆశావాహులు కూడా నామినేషన్స్ వేసేందుకు సిద్దమౌతున్నారు. నామినేషన్ షరతుల విషయానికొస్తే.. ఒక అభ్యర్థి రెండు నియోజిక వర్గాలకు మించి పోటీ చేయరాదు. నామినేషన్ వేసే టైమ్ లో అభ్యర్థితో పాటు ఐదుగురుకి మాత్రమే ఆర్ఓ రూంకి వెళ్ళేందుకు పర్మిషన్ ఉంటుంది. బరిలో నిలిచే అభ్యర్థి నామినేషన్ తో పాటు నేర చరిత్ర, స్థిర చర ఆస్తుల వివరాలకు సంబంధించిన పత్రాలు, విద్యార్హత వంటి సమాచారాన్ని తెలిపే ఫామ్ 26 లో కూడా అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. మొత్తానికి నామినేషన్ల పర్వం షురూ కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైంది.

Also Read:అసెంబ్లీ ఎన్నికలకు నోటీఫికేషన్..

- Advertisement -