కిషన్ రెడ్డి.. కమలంలో మార్పు తెస్తారా?

49
- Advertisement -

తెలంగాణ బీజేపీ గత కొన్నాళ్లుగా అంతర్గత విభేదాలతో సతమతమౌతోంది. వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుందని గాల్లో మేడలు కట్టిన కమలనాథులు ప్రస్తుతం పార్టీని నిలబెట్టుకునే పనిలో ఉన్నారు. కీలక నేతల మద్య అంతరం, సీట్ల పంపకల విషయంలో తర్జన భర్జన.. ఇలా చాలా అంశాలు బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది. అలాగే పార్టీలో ఎలాంటి ప్రదాన్యం దక్కలేదని ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందన్ వంటి వారు నిన్న మొన్నటి వరకు అలక బునారు.

Also Read:ఫుల్ కిక్ లో ప్రభాస్ ఫ్యాన్స్

ఈ పరిణామలన్నిటిని సద్దుమణిపెందుకు అధిష్టానం రంగంలోకి దిగి కీలక చేసింది. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి ఆ బాద్యతలు కిషన్ రెడ్డికి అప్పగించింది. అలాగే ఈటెల రాజేందర్ ను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ గా నియమించింది. కాగా తెలంగాణ బీజేపీ చీఫ్ గా నియమించబడిన కిషన్ రెడ్డి నేటి నుంచి ఆ బాద్యతలు చేపట్టనున్నారు. గతంలో రెండు సార్లు బీజేపీ చీఫ్ గా పని చేసిన కిషన్ రెడ్డి.. ఇప్పుడు మూడోసారి ఆ పదవి చేపట్టారు. కాగా గతంతో పోల్చితే ప్రస్తుతం బీజేపీ రాష్ట్రంలో కొంత మెరుగ్గా ఉంది. ఈలాంటి పరిస్థితుల్లో పార్టీలోని అంతర్గత విభేదాలను రూపు మాపల్సిన బాద్యత కిషన్ రెడ్డిపై ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులు గట్టిగానే దెబ్బ తీశాయి. మరి పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు కిషన్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు రచిస్తారు.? నేతల ఏకతాటిపైకి ఎలా తెస్తారు అనేది చూడాలి.

Also Read:అరవింద్‌కు వార్నింగ్ ఇచ్చిన కవిత

- Advertisement -