ఫుల్ కిక్ లో ప్రభాస్ ఫ్యాన్స్

6
- Advertisement -

ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ సినిమా క‌ల్కి 2898. ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ ను మేక‌ర్స్ హాలీవుడ్ ఈవెంట్‌లో అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్లింప్స్‌లో థీమ్, డీటెయిల్స్‌తో పాటుగా ప్ర‌భాస్ ఇంటెన్స్ లుక్స్ కూడా ఫ్యాన్స్‌కి ఓ రేంజ్‌లో కిక్కిస్తున్నాయి. అంతేకాదు గ్లింప్స్ చూస్తుంటే ఈ సినిమాలో ప్ర‌భాస్ వింటేజ్ లుక్స్‌లో క‌నిపిస్తున్నాడు. గ్లింప్స్ లాస్ట్ షాట్‌లో ప్ర‌భాస్ లుక్స్ అదిరిపోయాయ‌నే చెప్పాలి. అందుకే ప్రస్తుతం ఈ గ్లింప్స్ ఇండియా వైడ్ గా టాప్ లో ట్రెండ్ అవుతుంది. దాంతో ఇండియ‌న్ సినిమాలో మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా ఈ క‌ల్కి 2898 సినిమా నిలవబోతుంది.

సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ ని కామిక్ కాన్ ఈవెంట్‌లో రిలీజ్ చేయ‌గా ఈవెంట్‌కి చిత్ర యూనిట్ మొత్తం అటెండ్ అయింది. ఈవెంట్‌లో ఈ సినిమా డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌తో పాటు హీరో ప్ర‌భాస్, విల‌న్ క‌మ‌ల్ హాస‌న్ ఫోటోకి పోజులిచ్చారు. పిక్ ఆఫ్ ది డే గా నిలిచిన ఈ ఫోటో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. మొత్తమ్మీద అదిరిపోయే యాక్ష‌న్ సీక్వెన్స్‌, హాలీవుడ్‌కు ధీటైన‌ గ్రాఫిక్స్ హంగుల‌తో విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ ఫ‌స్ట్‌ గ్లింప్స్ అభిమానుల‌ను మెస్మరైజ్ చేస్తోంది.

Also Read:కీ అప్‌డేట్ ఇచ్చిన విశ్వక్‌!

నిజానికి ఈ మూవీ నుంచి మొన్న రిలీజైన ప్రభాస్ లుక్‌ను చూసి అభిమానులు ఒక్కసారిగా అసంతృప్తికి లోనయ్యారు. దానికి తగ్గట్లుగానే ప్రభాస్ లుక్ కూడా ఏమి బాగాలేదు. ఈ లుక్‌లో ‘ప్రభాస్ తల వేరే ఎవరి శరీరానికో అతికించినట్టు ఉంది’ అంటూ నెటిజన్స్ ట్రోల్ చేశారు. కానీ, తాజాగా రిలీజ్ విజువల్స్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ గురువు పాత్రలో నటించనున్నాడు.

Also Read:రక్తపోటు తగ్గాలంటే?

- Advertisement -